నాలుగు దశాబ్ధాల సినీ ప్రస్థానం చిరంజీవిది. అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్. సినిమాల్లోకి వచ్చాక చిరంజీవిగా మారాడు. 'ప్రాణం ఖరీదు', పునాది రాళ్లు' సినిమాలతో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు సినిమా బాక్సాఫీసు స్టామినాకి కొత్తర్ధం చెప్పాడు చిరంజీవి. 'సుప్రీమ్' హీరో నుండి మెగాస్టార్ దాకా ఆయన ప్రస్థానం అత్యంత ప్రత్యేకం. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి, వంద కోట్లు కొల్లగొట్టిన ఘనుడు చిరంజీవి. అందుకే తెలుగు సినిమాకి ఒన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ ఆయన. ఒకటి నుండి పదిదాకా చిరంజీవే ఆ తర్వాతే ఇంకెవరైనా అని సూపర్ స్టార్ మహేష్‌బాబు చెప్పాడంటే, అది మహేష్‌కి ఆయన పట్ల ఉన్న అమితమైన అభిమానం అని చెప్పొచ్చు. డాన్సుల్లో కొత్త స్టైల్ తీసుకొచ్చింది చిరంజీవి. ఇప్పటికీ ఎప్పటికీ డాన్స్ అంటే చిరంజీవి. కామెడీ అంటే చిరంజీవి. యాక్షన్ అంటే చిరంజీవి. రొమాన్స్ అంటే చిరంజీవి. ఒక్కడిగా ఎంట్రీ ఇచ్చి, కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడు. కానీ ఇప్పుడు మెగాస్టార్ అంటే ఒక్కడే కాదు ఓ మెగా ఫ్యాక్టరీ. ఒక్కడుగా మొదలైన ఆయన నుండి చిగురించిన పలవలు పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్‌తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, ఆఖరికి నిహారిక కూడా ఇలా ఇంతమందిగా ఎదిగింది. ఇకపై ఇంకెంత మందో. అందుకే ఆయన సినీ పరిశ్రమకి ఓ మెగా ఫ్యాక్టరీ. ఈ రోజు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా హార్ట్ల్లీ హ్యాపీ బర్త్‌డే టు మెగాస్టార్!