ఈ సంక్రాంతి పోటీలో నిలబడిన సినిమాల్లో 'హను-మాన్' ఒకటి. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈనెల 12న వస్తోంది. అదే రోజున 'గుంటూరు కారం' విడుదల అవుతోంది. మహేష్ సినిమాతో పోటీ పడడమే పెద్ద రిస్క్. ఆ వెంటనే ఈగల్, సైంధవ్, గుంటూరు కారం వచ్చేస్తున్నాయి.
తొలి రోజు 90 శాతం థియేటర్లని 'గుంటూరు కారం' ఆక్రమించుకొంటోంది. కొన్ని ఏరియాల్లో `హను-మాన్`కి సింగిల్ థియేటర్ కూడా దక్కడం లేదు. ఉదాహరణకు వైజాగ్‌లో ఎన్ని థియేటర్లుంటే అన్ని థియేటర్లని గుంటూరు కారంకే కేటాయించారు. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. ఏపీ, తెలంగాణలలో 200 థియేటర్లకు మించి హనుమాన్‌కు దొరకడం లేదు.
ఆ తరవాత కూడా అంతే. 13న రెండు సినిమాలొస్తాయి. 14న ఒకటుంది. అన్నీ పెద్ద సినిమాలే. కాబట్టి.. ఉన్న థియేటర్లన్నీ ఆ నాలుగు సినిమాలే పంచుకొంటాయి. మరి 'హనుమాన్‌కి' ఎలా? నిజానికి సినిమాని వాయిదా వేసుకొంటే మంచిది అని దిల్ రాజు లాంటి నిర్మాతలు హనుమాన్ టీమ్ కి సలహా ఇచ్చారు. కానీ.. వీళ్లు వినడం లేదు. 11న వచ్చినా తొలి రోజు వసూళ్లతో సర్దుకుపోవొచ్చు. కానీ నార్త్ లో ఇప్పటికే 12న తేదీన థియేటర్లు బ్లాక్ చేశారు. 11న విడుదలై, సినిమా ఎంత బాగున్నా... 12న తేదీన గుంటూరు కారం కోసం సినిమాని తీసేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు 11న విడుదలైనా లాభం లేదన్నది హనుమాన్ టీమ్ వాదన. 'హనుమాన్' దేవుడి సినిమా అని, చిన్న పిల్లలకు, కుటుంబ సభ్యులకూ బాగా నచ్చుతుందని ఆ నమ్మకంతోనే తమ సినిమాని విడుదల చేస్తున్నామని చెబుతున్నారు మేకర్స్. మరి.. ఆ నమ్మకం ఎంత వరకూ నిలబడుతుందో చూడాలి.