ద‌స‌రా సంద‌ర్బంగా`ఊరంతా అనుకుంటున్నారు'.

మరిన్ని వార్తలు

`నందిని నర్సింగ్ హోమ్` చిత్రంతో కథానాయకుడిగానే మంచి గుర్తింపు తెచ్చుకొన్న నవీన్ విజయ్ కృష్ణ హీరోగా బాలాజీ సానల దర్శకత్వంలో రోవాస్కైర్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్‌పై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `ఊరంతా అనుకుంటున్నారు`. సెన్సార్ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసుకుని ఈ చిత్రం క్లీన్ `యు` స‌ర్టిఫికేట్‌ను పొందిన ఈ చిత్రాన్ని ద‌స‌రా సంద‌ర్బంగా అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేస్తున్నారు.

 

ఈ సంద‌ర్భంగా ... చిత్ర నిర్మాతలు‌ మాట్లాడుతూ ``మా `ఊరంతా అనుకుంటున్నారు` చిత్రంవిందు భోజ‌నంలాంటి సినిమా. సినిమా చూసిన ప్రేక్ష‌కుల‌కు మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చూశామ‌ని గ్యారంటీగా ఫీల్ అవుతారు. కె.రాధాకృష్ణ‌గారి అద్భుత‌మైన సంగీతం, జి.ఎల్‌.ఎన్‌.బాబు బ్యూటీఫుల్ విజువ‌ల్స్‌, సున్నితమైన ఫ్యామిలీ కామెడీతో పాటు జయసుధ- రావు రమేష్ ల మధ్య, నవీన్ విజయకృష్ణ - శ్రీనివాస్ అవసరాల మధ్య సన్నివేశాలు భావోద్వేగాన్ని కలిగించేలా దర్శకుడు బాలాజీ సానల చిత్రీకరించారు. ఈ పండ‌గలాంటి సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS