మిల్కీబ్యూటీ ఇంకోటి మొదలెట్టేసిందోచ్‌!

By Inkmantra - October 03, 2019 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

మిల్కీబ్యూటీ తమన్నా, హ్యాండ్‌సమ్‌ గై గోపీచంద్‌ జంటగా ఓ చిత్రం ఇటీవల అనౌన్స్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బోయపాటి శీను ముఖ్య అతిధిగా విచ్చేశారు. కాగా ఈ సినిమాకి 'సీటీ మార్‌' అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమన్నా కబడ్డీ కోచ్‌ పాత్రలో నటిస్తుందనీ సమాచారం. శ్రీనివాస్‌ చిట్టూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 

త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ సినిమాకి మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకుడు. గతంలో సంపత్‌ నందితో తమన్నా రెండు సార్లు కలిసి వర్క్‌ చేసింది. ఆ రెండు సినిమాల్లోనూ తమన్నాని చాలా అందంగా చూపించే ప్రయత్నం చేశాడు సంపత్‌ నంది. ముచ్చటగా మూడో సారి ఈ సినిమాలో తమన్నాని అత్యంత అద్భుతంగా చూపించేందుకు సంపత్‌ నంది సిద్ధంగా ఉన్నాడట. ఇదిలా ఉంటే, లేటెస్ట్‌గా తమన్నా 'సైరా నరసింహారెడ్డి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

ఈ సినిమా తమన్నాకు కెరీర్‌ బెస్ట్‌ మూవీ అని చెప్పక తప్పదు. ఈ సినిమాలో నయనతార, తమన్నా ఇద్దరు హీరోయిన్లు నటించగా, తమన్నాకే ఎక్కువ ఇంపార్టెన్స్‌ దక్కిందనీ, సినిమా చూసిన వాళ్లంతా అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ టాక్‌తో ఇప్పట్లో మళ్లీ మిల్కీబ్యూటీ కెరీర్‌కి తిరుగు లేదని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. మరోవైపు తమన్నా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో స్పెషల్‌ సాంగ్‌తో అలరించనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, తమిళంలో 'పెట్రోమాక్స్‌' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది తమన్నా .


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS