రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం `ఒరేయ్ బుజ్జిగా`. మాళవిక నాయర్, హెబ్బా పటేల్ కథానాయికలు. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. థియేటర్లు తెరవకపోవడం ఓటీటీకి ఈసినిమాని అమ్మేశారు. ఆహాలో అక్టోబరు 2న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే.. ఇప్పుడు చిత్రబృందం నిర్ణయం మార్చుకుంది. అక్టోబరు 2న కాకుండా 1నే ఈసినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
అక్టోబరు 1, సాయింత్రం 6 గంటలకు ఈ సినిమాని చూసేయొచ్చు. అక్టోబరు 2న అనుష్క సినిమా `నిశ్శబ్దం` కూడా అక్టోబరు 2నే విడుదల అవుతోంది. అమేజాన్ ప్రైమ్ లో ఈసినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నారు. అందుకే ఒరేయ్ బుజ్జిగా కాస్త ముందుగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై అటు రాజ్ తరుణ్, ఇటు విజయ్ కుమార్ కొండా చాలా ఆశలే పెట్టుకున్నారు. వరుస ఫ్లాపులకు పుల్ స్టాప్ పెట్టాలంటే... రాజ్ తరుణ్‌కి ఈ సినిమా హిట్ కావాల్సిందే. మరి ఏం జరుగుతుందో చూడాలి.