డబుల్ హ్యాట్రిక్ హీరో రాజ్‌తరుణ్ తాజా చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’ ఫస్ట్‌లుక్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ఫస్ట్‌లుక్‌లో డిఫరెంట్ వేరియేషన్స్‌లో రాజ్ తరుణ్ కనిపిస్తున్నాడు. కానీ, అన్నింట్లోనూ సేమ్.. హీరోయిన్‌తో తన్ను తింటున్నాడు. మరీ దారుణంగా కింద పడేసి మరీ కుమ్మేస్తోంది హీరోయిన్ మన బుజ్జిగాన్ని. బ్యాట్‌తో బాదేస్తోంది. అసలింతకీ మన బుజ్జిగాడికి ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో. ఫస్ట్‌లుక్‌తో సినిమాపై ఆసక్తి క్రియేట్ చేశారు. సినిమా సూపర్ ఎంటర్టైనర్ అనే హింట్ ఇచ్చారు. హీరోయిన్ చేతిలో మన హీరో ఎందుకంతలా దెబ్బు తింటున్నాడో కానీ, ఇంతకీ మన హీరోని కింద పడేసి మరీ చితక్కొట్టేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? ‘కళ్యాణ వైభోగమే’ ఫేమ్ మాళవికా నాయర్.
హీరోపై పాపం ఈ పాపకు అంత కోపం ఎందుకో తెలియాంటే ‘ఒరేయ్ బుజ్జిగా’ చూడాల్సిందే. ఆ ఇద్దరి క్యూట్ ఫైట్ చూడాలంటే సమ్మర్ వరకూ ఆగాల్సిందే. అన్నట్లు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందండోయ్. ‘కుమారి 21 ఎఫ్’ బ్యూటీ హెబ్బా పటేల్. అయితే, ఫస్ట్‌లుక్‌లో హెబ్బాకి చోటు దక్కలేదు. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు రాజ్ తరుణ్. రీసెంట్గా వచ్చిన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం కూడా రాజ్‌తరుణ్‌ని నిరాశపరచడంతో, ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లుగా ఫస్ట్‌లుక్ రెస్పాన్స్ చూస్తే, ఈ సినిమాతో రాజ్‌తరుణ్ బౌన్స్ బ్యాక్ అవుతాడనిపిస్తోంది. చూడాలి మరి.