తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న కన్నుగీటు బ్యూటీ

By iQlikMovies - December 24, 2018 - 14:52 PM IST

మరిన్ని వార్తలు

కన్ను గీటి ఒక్క నైటులోనే దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయిపోయిన ముద్దుగుమ్మ 'ప్రియా ప్రకాష్‌ వారియర్‌'. సంబంధం లేకుండా అనూహ్యమైన సెన్సేషన్‌ సృష్టించింది ఈ ముద్దుగుమ్మ. ఏదో సినిమా సక్సెస్‌ వల్లనో లేక సామాజిక సేవల వల్లనో వచ్చిన సెన్సేషన్‌ కాదిది. ఒక్క వీడియో క్లిక్‌తో ఈ రేంజ్‌ పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ బ్యూటీకి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు.

ఇలా వచ్చిన పాపులారిటీని ఆల్రెడీ ఈ బ్యూటీ చాలావరకూ వినియోగించేసుకుంది సరే, ఇంతకీ ఇంత పాపులారిటీ రావడానికి కారణమైన ఆ వీడియో 'ఒరు ఆధార్‌ లవ్‌' అనే మలయాళ చిత్రంలోనిది. సినిమా విడుదలకు ముందే ఈ బ్యూటీకొచ్చిన పాపులారిటీ సినిమా ఘన విజయం సాధించడంలో తోడ్పడింది. అక్కడ ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదల కానుంది. లవర్స్‌డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తెలుగులో 'లవర్స్‌డే ' టైటిల్‌తో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి యూత్‌లో ప్రియా ప్రకాష్‌కున్న క్రేజ్‌తో ఈ సినిమా ఏ రేంజ్‌లో విజయాన్ని అందుకుంటుందో. ఇకపోతే తెలుగులో ఆల్రెడీ పలు ప్రకటనల్లో ప్రియా ప్రకాష్‌ వారియర్‌ నటించేసింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రియా ప్రకాష్‌ వారియర్‌ తెలుగులో మళ్లీ ప్రభంజనం సృష్టిస్తుందేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS