చిత్ర పరిశ్రమ లో ఏ కళకైనా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునిచ్చే అత్యున్నత అవార్డు ఏమిటంటే.. బ్రిటిష్ అకాడమి అందించే 'ఆస్కార్ అవార్డు' అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు అన్ని క్యాటగిరీలను కవర్ చేస్తూ కళాకారులను ప్రోత్సహిస్తుంది ఈ ఆస్కార్ అకాడమి. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వంటి సూపర్ హీరో చిత్రాలకు మాత్రం మొట్ట మొదటి సారి 'ఉత్తమ నటీ నటుల' క్యాటగిరిలో 2008 లో "ది డార్క్ నైట్'' చిత్రానికి చోటు దక్కింది.
ప్రముఖ దర్శకుడు 'క్రిస్టోఫర్ నోలన్' దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో ''జోకర్'' పాత్ర పోషించినందుకు గాను.. నటుడు 'హీత్ లెడ్జెర్' కు ఉత్తమ సహాయ నటుడి క్యాటగిరి లో ఈ అవార్డు దక్కింది. అంతే కాదు ఆ పాత్రకు 'పాప్ కల్చర్' లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ చిత్రాలను అందిస్తున్న 'డీ.సీ' సంస్థ తాజాగా ''జోకర్'' స్టాండ్ ఎలోన్ సినిమాతో ముందుకు రానుంది. 'హీత్ లెడ్జెర్' మరణాంతరం 'జోకర్' పాత్రలో పరకాయ ప్రవేశం చేసే నటుడు ఎవరుంటారు అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న సమయం లో ఆ పాత్ర పోషించడానికి 'గ్లాడియేటర్', 'హర్' వంటి చిత్రాలతో మెప్పించిన ''ఆక్విన్ ఫీనిక్స్" ముందుకొచ్చాడు.
ఈ మధ్య జరిగిన 'వెనిస్ ఫిలిం ఫెస్టివల్' లో అంతర్జాతీయ క్రిటిక్స్ సమక్షం లో ఈ చిత్రం ప్రదర్శించబడింది. చిత్రం పూర్తవగానే అందరూ లేచి నిల్చుని 8 నిమిషాల పాటు చప్పట్లు కొడుతూనే ఉన్నారట..ఇక క్రిటిక్స్ అయితే చిత్ర దర్శకుడు 'టాడ్ ఫిలిప్స్' ను ప్రశంసించి 'జోకర్' పాత్ర పోషించిన నటుడు 'ఆక్విన్ ఫీనిక్స్' కు 'ఆస్కార్' రావడం పక్కా అంటూ ఆకాశానికెత్తారు. భారీ అంచనాలతో "జోకర్" అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.