అదిరిపోతున్న ఓటీటీ రేట్లు

మరిన్ని వార్తలు

ఇండియాలో పేరుగాంచిన OTT ల్లో అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ముఖ్యమైనవి. ఈ రెండు ఒకదానికి ఒకటి గట్టి పోటీ ఇస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ సినిమాలకి ఈ రెండిటి మధ్య పోటీ నెలకొంటోంది. నెట్ ఫ్లిక్స్ ఈ మధ్య సౌత్ సినిమాలపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది. ఎంత డిమాండ్ ఉన్నా భారీ రైట్స్ కి సినిమాలు కొనుగోలు చేస్తోంది. సూపర్ స్టార్స్ సినిమాలకి అయితే అసలు వెనక్కి తగ్గటం లేదు. ఈ క్రమంలోనే ఈ మధ్య నెట్ ఫ్లిక్స్ అధినేతలు టాలీవుడ్ యాక్టర్స్ ని కలిసి వెళ్లారు. 2024 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమాల్ని ఈ రెండు OTT సంస్థలు, దక్కించుకున్నట్టు, ఇప్పటికే డీల్స్ క్లోజ్ అయినట్టు సమాచారం. 


ప్రజంట్ పాన్ ఇండియా సినిమాలకి పెట్టిన ఖర్చు తిరిగి రావటానికి OTT లు  కీలక పాత్ర వహిస్తున్నాయి. థియేట్రికల్ బిజినెస్ కంటే, ముందే OTT ఫ్లాట్ ఫామ్స్ రంగంలోకి దిగి డీల్ క్లోజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే  RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలు గేమ్ చేంజర్, దేవర, పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాల డిజిటల్ బిజినెస్ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర మూవీ OTT రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం 155 కోట్లు చెల్లించినట్టు సమాచారం.  ఈ మూవీ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.  ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జాన్వీకి ఇదే సౌత్ డెబ్యూ.    


RRR తర్వాత గ్లోబల్ స్టార్  రామ్ చరణ్ నుంచి వస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమాని లెజండ్రీ డైరక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. చెర్రీకి జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. ఈ మూవీని 105 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. హిందీ వెర్షన్ మినహాయించి, మిగతా అన్ని భాషల స్ట్రీమింగ్ నిమిత్తం ఈ మొత్తం చెల్లించినట్టు తెలుస్తోంది. 


సలార్ తో బాక్సాఫీస్ లెక్కలు తారు మారు చేసిన ప్రభాస్ నెక్స్ట్ మూవీ కల్కి. ఇది మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్ గా, కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారు. ఇంకా క్రేజి కాస్టింగ్ ఈ సినిమాలో ఉన్నారు. ఈ మూవీ కోసం మేకర్స్ భారీగా డిమాండ్ చేస్తున్నారు. 180 కోట్ల రేస్ లో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ పోటీ పడుతున్నాయి. చివరికి ఎవరు దక్కించుకుంటారో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS