లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడ్డాయి. మళ్లీ పరిస్థితి చక్కబడ్డానికి కనీసం రెండు మూడు నెలలైనా పట్టేలా ఉంది. అందుకే ఓటీటీలవైపు చూస్తున్నారు నిర్మాతలు. ఓటీటీ సంస్థలు కూడా సినిమాల్ని కొనడానికి రెడీనే. అయితే.. ఓటీటీలకు ఇప్పుడు క్రేజ్ ఉన్న సినిమాలే కావాలి. చిన్నా, చితకా సినిమాల్ని ఓటీటీలు అస్సలు పట్టించుకోవడం లేదు. అందులో భాగంగా మూడు పెద్ద సినిమాలపై అమేజాన్ కన్నేసింది. ఆయా నిర్మాతలతో టచ్‌లో ఉంటోంది.
వెంకటేష్ `దృశ్యమ్ 2` అమేజాన్ లో విడుదలయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాని ఓటీటీ కోసమే రూపొందించారు. ఇప్పుడు అమేజాన్ తో బేరం కుదరే అవకాశాలున్నాయి. ఈ వారంలో డీల్ పక్కా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నితిన్ `మాస్ట్రో` పైనా అమేజాన్ కన్నేసింది. మంచి రేటుకి ఈ సినిమాని అమేజాన్ సొంతం చేసుకుందని టాక్.
దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందిన `పాగల్` సినిమా కూడా అమేజాన్ పరం అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్. పాగల్, దృశ్యమ్ 2.... దాదాపు సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు. `మాస్ట్రో` మాత్రం ఇంకా షూటింగ్ బాలెన్స్ ఉంది. జూన్ - జులైలలో పాగల్, దృశ్యమ్ ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.