'మహర్షి' మ్యాజిక్‌ అంతకుమించి..!

మరిన్ని వార్తలు

మహేష్‌బాబు సినిమా అంటే ఆటోమెటిగ్గా అంచనాలుండడం సహజమే. కానీ 'మహర్షి'లో అంతకు మించిన మ్యాజిక్‌ ఏదో ఉందనిపిస్తోంది. ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకుండా, ఎంతె సైలెన్స్‌ ప్రదర్శించారు ఈ సినిమా విషయంలో, కానీ ఇప్పుడొస్తున్న అప్‌డేట్స్‌ ఫ్యాన్స్‌ని పిచ్చెక్కించేస్తున్నాయి.

 

'మహర్షి' నుండి విడుదలవుతోన్న ఒక్కో స్టిల్‌ కేక పుట్టించేస్తున్నాయి. మహేష్‌ ఫ్యాన్స్‌కి బోలెడంత బూస్టప్‌నిస్తున్నాయి. ఇంతవరకూ వచ్చిన మూడు పాటలూ సూపర్‌ రెస్పాన్స్‌ తెచ్చుకున్నాయి. ఇక వెరీ లేటెస్ట్‌గా వచ్చిన నాలుగో సింగిల్‌, 'పదరా పదరా..' విడుదలైన కొద్ది నిముషాలకే యూట్యూబ్‌ని ఓ ఊపు ఊపేస్తోంది. ఈ ఆడియో సింగిల్‌లోని మహేష్‌ స్టిల్స్‌ కిర్రాకు పుట్టిస్తున్నాయి. ప్యాంటు, షర్టు వేసుకుని, తలపాగా కట్టి, మోడ్రన్‌ రైతులా మహేష్‌ వ్యవసాయం చేస్తున్న స్టిల్స్‌ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. చూస్తుంటే మహేష్‌ ఏదో పెద్ద మ్యాజిక్కే చేసేలా ఉన్నాడు 'మహర్షి'తో. అభిమానుల్లో ఉత్కంఠ ఆగడం లేదు. కానీ తప్పదుగా మే 9 వరకూ ఆ ఉత్కంఠని అలాగే ఆపుకోవాలి. వరుస ఫెయిల్యూర్స్‌ తర్వాత 'భరత్‌ అనే నేను' సినిమాతో కష్టపడి హిట్టులాంటి హిట్టు కొట్టాననిపించుకున్నాడు మహేష్‌. కానీ 'మహర్షి' అలా కాదు, విడుదలకు ముందే సమ్‌థింగ్‌ ఎట్రాక్ట్‌ చేస్తోంది. అయినా అక్కడున్నది వంశీ పైడిపల్లి. వంశీని అంత తక్కువగా అంచనా వేయడానికి లేదు. అందులోనూ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు కూడా ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

 

సో ఇన్ని అదనపు ఆకర్షణలతో మహేష్‌ ఫ్యాన్స్‌లోనూ నమ్మకాలు స్ధిరపడిపోయాయి, 'మహర్షి' పక్కా హిట్‌ అని. అయితే ఫైనల్‌ వర్డిక్ట్‌ ఏంటనేది ఇక కొన్ని రోజుల్లోనే తేలిపోనుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS