'పద్మావత్' ఇటీవల వివాదాల వలలో చిక్కుకుని దేశం దృష్టిని ఆకర్షించిన సినిమా. ఇంతవరకూ ఏ సినిమాకీ ఇన్ని వివాదాలు చెలరేగి ఉండవు. అయితే ఎట్టకేలకు సినిమా విడుదలయ్యింది, సినిమాలోని కంటెన్ట్ వివాదాలకు ఆస్కారం లేకపోవడంతో, ఆందోళనకారులు కామ్ అప్ అయిపోయారు. విడుదలయ్యాక ఏదో రెండు రోజులు హడావిడి చేసినా, చెల్లలేదు.
ఏ రకమైన అభ్యంతరకర సన్నివేశాలు సినిమాలో లేకపోవడంతో సినిమాకి ప్రేక్షకుల నుండి పూర్తి సపోర్ట్ లభించింది. దాంతో ఆందోళనకారులు పూర్తిగా కామ్ అప్ అయిపోయారు. అయితే ఈ వివాదాల ప్రభావంతో సినిమా కొన్ని రాష్ట్రాల్లో విడుదల కాలేదు. దాంతో వసూళ్లపై తీవ్ర ప్రభావం పడింది. అయితే విడుదలయ్యాక రెండు రోజుల తర్వాత అనూహ్యంగా వసూళ్లు పుంజుకున్నాయి. అయితే ఈ వివాదాలేమీ లేకుంటే సినిమా ఓ సంచనలం అయ్యేదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఎలాగైనా ఇప్పటికి 'పద్మావత్' వంద కోట్లు వసూళ్లు దాటేసింది. వివాదాలు లేకుంటే, తొలి రెండు రోజుల్లోనే ఈ ఫిగర్‌ని టచ్ చేసేసి ఉండేదనడంలో సందేహం లేదు.
ఓవర్సీస్‌లో సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఏది ఏమైనా ఎంత దెబ్బ కొడదామన్నా కొన్ని సినిమాలు అలాగే సంచలనం అవుతూ ఉంటాయి. అయితే చాలా సినిమాల విషయంలో వివాదాలు ప్లస్ అవుతుంటాయి. కానీ 'పద్మావత్' వివాదం మాత్రం ప్రేక్షకుల్ని మరీ విసిగించేసింది. దాంతో సినిమా విజయంపై ఈ ప్రభావం ఒకింత ఎక్కువగానే పడిందని చెప్పక తప్పదు.
చూడాలి మరి ఈ సినిమా ముందు ముందు సృష్టించబోయే సంచలనాలు ఎలా ఉండబోతున్నాయో. దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకి సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.