దీపిక పడుకునే పద్మావత్ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. అయితే ఈ చిత్రం మొన్నటి నుండి ప్రత్యేక షోలు వేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగానే నిన్నటి సాయంత్రం సామాన్య ప్రేక్షకుల కోసం ప్రత్యేక షోలు దేశవ్యాప్తంగా వేయడం జరిగింది.
అనూహ్యంగా నిన్న జరిగిన స్పెషల్ షోల తోనే సుమారు రూ 5కోట్ల రూపాయలు వచ్చినట్టు సమాచారం. అలాగే ఈ చిత్రంకి పాజిటివ్ టాక్ రావడం అలాగే ఈ సినిమా పైన కర్ణిసేన చేస్తున్న పరోక్ష దాడికి చాలామందికి సానుభూతి కూడా ఉంది. ఇవన్ని కలగలిపి ఈ చిత్రానికి కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్ళు సాధించే క్రమం కనపడుతున్నది.
ఇవ్వని పక్కన పెడితే, కొన్ని రాష్ట్రాల్లో ఈ చిత్ర ప్రదర్శన జరగనివ్వకుండా కర్ణి సేన కార్యకర్తలు దాడులకి పాల్పడడంతో ఈ సినిమా కొన్ని చోట్ల ఇంకా విడుదల కాలేదు. మొత్తానికి తీవ్ర వివాదాల్లో విడుదలైన చిత్రం ఎంతమేర బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చూపిస్తుందో చూడాలి.