‘పద్మావతి’ని రెండు రాష్ట్రాలు బ్యాన్ చేశాయి

మరిన్ని వార్తలు

వివాదస్పదంగా మారిని పద్మావతి చిత్ర విడుదలని ఆ చిత్ర నిర్మాతలే వాయిదా వేసుకున్నారు అంటే పరిస్థితి తీవ్రత మనకి అర్ధమవుతుంది.

 

తాజాగా ఈ చిత్రాన్ని తమ రాష్ట్రాలలో విడుదల కానివ్వబోమని రెండు రాష్ట్రల ప్రభుత్వ పెద్దలు ప్రకటించేశారు. అందులో ఒకటి ఉత్తర్ ప్రదేశ్ కాగా మరొకటి మధ్యప్రదేశ్. ఈ చిత్రంలో పద్మావతి ఖ్యాతిని దెబ్బతీసే సన్నివేశాలతో చిత్రాన్ని విడుదల కానివ్వబోమని తేల్చిచెప్పారు.

 

ఇదేసమయంలో రాజస్తాన్ ముఖ్యమంత్రి సైతం ఈ చిత్రంలోని అభ్యంతరకర సన్నివేశాలు తోలిగించాకనే సినిమా విడుదలకి ఒప్పుకుంటామని చెప్పేశాడు.

మొత్తానికి ఈ చిత్రం విడుదల కాకముందే బ్యాన్ అవ్వడం పట్ల అందరు తమ తమ అభిప్రయాలు వ్యక్తంచేస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS