గ్లామ్‌షాట్‌: 'పైసా' వసూల్‌ హాట్‌నెస్‌.!

By Inkmantra - April 16, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

నాని హీరోగా తెరకెక్కిన 'పైసా' సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుంది కదా. పేరు సిద్ధిఖా శర్మ. ఆ అమ్మడే ఇప్పుడు మీకు ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ. మోడలింగ్‌ రంగం నుండి సినిమాల్లోకి వచ్చిన ఈ ఉత్తరాఖండ్‌ భామకు ఫ్యాషన్‌ డిజైనింగ్‌లోనూ డిగ్రీ చేసిన అనుభవం కూడా ఉంది. గ్లామర్‌ ఒలకబోయడంలో పెద్దగా మొహమాటాల్లేవ్‌. అందుకే తొలి సినిమాలోనే బికినీలో భారీగా అందాల ప్రదర్శన ఇచ్చేసింది. మోడల్‌ కదా. అలా అలా నడిస్తే చాలు, పండాల్సిన వయ్యారాలన్నీ పండేస్తాయి. 

 

అదే చేసింది 'పైసా' సినిమాలో. అయితే ఆ తర్వాత పెద్దగా సినిమా ఆఫర్లు లేవు కానీ, పలు వీడియో సాంగ్స్‌లో నటించింది. సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ తళుక్కున మెరిసే ఈ హాట్‌ బ్యూటీ లేటెస్ట్‌గా ఈ ఫోటో పోస్ట్‌ చేసింది. ఫోటోకి నెట్టింట్లో రెస్పాన్స్‌ అదిరిపోతోంది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి నిజంగానే ఈ ఫోటో సింప్లీ సూపర్బ్‌. కెమెరా పనితనమూ, అమ్మడి అందాలూ రెండూ పోటీ పడినట్లుగా ఉందీ పిక్‌. బ్రౌన్‌ అండ్‌ బ్లాక్‌ కలర్‌ కాంబినేషన్‌ కాస్ట్యూమ్‌ అమ్మడి స్కిన్‌ టోన్‌ని మరింత బ్రైట్‌గా చూపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS