కొత్త దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన సినిమా ‘పలాస 1978’. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రివ్యూ షోకి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ని గెస్ట్‌గా ఆహ్వానించారు. సినిమా చూసి, అల్లు అరవింద్ చిత్రయూనిట్‌ని ప్రశంసలతో ముంచెత్తేశారు. చాలా బావుందనీ, ఖచ్చితంగా హిట్ అవుతుందని సర్టిఫికెట్ ఇచ్చేశారు. డైరెక్టర్ పనితనం పిచ్చ పిచ్చగా నచ్చేసిన మన నిర్మాతగారు అక్కడితో ఆగలేకపోయారు. తన తదుపరి చిత్రం తమ బ్యానర్‌లో చేయాలని అక్కడికక్కడే డైరెక్టర్‌ని అడ్వాన్స్ బుకింగ్ చేసేసుకున్నారు. అదేనండీ అడ్వాన్స్‌గా చెక్ ఇచ్చేసి, ఆయన రెండో సినిమా తన బ్యానర్‌లోనే చేయాలని కమిట్మెంట్ తీసుకున్నారు.
సినిమా రిలీజ్ కాకుండానే, ఓ బడా నిర్మాత డెబ్యూ డైరెక్టర్‌కి ఈ రేంజ్‌లో తన ప్రోత్సాహాన్ని అందిస్తే, అంత కన్నా అదృష్టం ఇంకేముంటుంది.. సో కరుణ కుమార్ జాక్ పాట్ కొట్టినట్లే. మరి, అల్లు అరవింద్ ఇచ్చిన ఆఫర్‌ని కరుణ కుమార్ ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలిక. ఇకపోతే, ‘పలాస 1978’ మూవీలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించిన సంగతి తెలిసిందే. రఘు కుంచె ఈ సినిమాకి మ్యూజిక్ అందించడంతో పాటు, ఓ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించారు. రిలీజ్‌కి ముందే బడా నిర్మాత అల్లు అరవింద్ ఆశీర్వాదం పొందిన ఈ సినిమాకి ఆడియన్స్ ఆదరణ కూడా దక్కుతుందా.? చూడాలిక.