విశాల్‌ కూడా విజయదశమికే.!

By iQlikMovies - September 27, 2018 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

తమిళ హీరో విశాల్‌కి మాస్‌లో మంచి ఫాలోయింగ్‌ వుంది. తెలుగోడే అయినా తమిళంలో సెటిలయ్యాడు. తమిళ హీరో అయినా తన డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగులో కూడా మంచి మార్కెట్‌ సంపాదించుకున్నాడు. 

గతంలో విశాల్‌, మీరా జాస్మిన్‌ జంటగా తెరకెక్కిన 'పందెంకోడి' చిత్రం విశాల్‌ కెరీర్‌లో మంచి హిట్‌ అందుకుంది. ఆ సినిమాతోనే విశాల్‌ కెరీర్‌ టర్న్‌ అయ్యిందని చెప్పొచ్చు. అలాంటి 'పందెంకోడి' సినిమాకి సీక్వెల్‌ రూపొందించాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. కానీ కుదరలేదు. ఇన్నాళ్లకు అది కుదిరింది. ఎన్‌. లింగుస్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 29న 'పందెంకోడి 2' ధియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కానుంది. దసరా కానుకగా అంటే అక్టోబర్‌ 18న 'పందెంకోడి 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. 

లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌తో కలిసి సంయుక్తంగా విశాల్‌ ఫిల్మ్స్‌ ఫ్యాక్టరీలో ఈ సినిమా రూపొందింది. విశాల్‌తో 'మహానటి' కీర్తిసురేష్‌ జత కడుతోంది. 'పందెంకోడి' స్థాయిలో హిట్‌ అందుకోనుందనీ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవలే 'అభిమన్యుడు' సినిమాతో సూపర్‌హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు విశాల్‌. 

మరోవైపు దసరా బరిలో తెలుగు సినిమాలు ఎన్టీఆర్‌ 'అరవింద సమేత..', విజయ్‌ దేవరకొండ 'నోటా'లపై భారీ అంచనాలున్నాయి. వాటితో పాటు విశాల్‌ కూడా ఓ మోస్తరు అంచనాలతో 'పందెంకోడి 2 సినిమాతో బరిలోకి దూకుతున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS