మిల్కీబ్యూటీ తమన్నాకి ఓ పెంపుడు కుక్క ఉంది. ఆ కుక్కకు ఒంట్లో బాగోలేకపోతే వైద్యుని వద్దకు తీసుకెళ్లింది. ఆ కుక్కను పరీక్ష చేసిన వైద్యులు పారాలిటిక్ ఎటాక్ అనే వ్యాధి సోకిందని చెప్పారట. నాన్‌వెజ్ ఎక్కువగా తినడం వల్లే ఆ వ్యాధి సోకిందనీ, సో నాన్‌వెజ్ పెట్టకూడదని చెప్పారట.
దాంతో కుక్క కోసం తాను కూడా నాన్‌వెజ్ తినడం మానేసిందట తమన్నా. అయ్యో పాపం తమన్నాకు నాన్‌వెజ్ అంటే ఎంతో ఇష్టం కదా. అందులోనూ చికెన్ అంటే. ఎలా తెలుసంటారా? మీకు కూడా తెలుసండీ. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌కి వెళ్లి చూడండి. అదేనండీ తమన్నా నటించిన '100 పర్సెంట్ లవ్' సినిమా వరకూ వెళ్తే చాలు. ఆ సినిమాలో తమన్నాకు చికెన్ అంటే ఎంతిష్టమో కదా. పాపం గొడవలు పడినా కూడా తమన్నాకి ఇష్టమని సినిమా క్లైమాక్స్‌లో చైతూనే తమన్నాకి చికెన్ తెచ్చిపెడతాడు.
సినిమాలోనే కాదండోయ్ నిజంగానే తమన్నా ఫ్యామిలీకి నాన్‌వెజ్ అంటే ఎంతో ఇష్టమట. అంత ఇష్టమైన చికెన్‌ని తమన్నా తన కుక్క కోసం త్యాగం చేసేసింది. కుక్క కోసం చికెన్‌ని త్యాగం చేస్తే, తమన్నా తినని చికెన్ జన్మ ఎందుకు అని చికెన్ ఫీలవ్వదు పాపం. అయినా కానీ తన పెంపుడు కుక్క కోసం ఇంత పెద్ద త్యాగం చేసిన మిల్కీబ్యూటీని నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందేనండోయ్. అదీ సంగతి.