క‌ల్యాణ్‌దేవ్‌`సూప‌ర్‌మ‌చ్చి`లో క‌న్న‌డ బ్యూటీ.

By iQlikMovies - November 15, 2019 - 17:22 PM IST

మరిన్ని వార్తలు

క‌ల్యాణ్‌దేవ్‌, రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రిజ్వాన్ నిర్మాత‌గా పులివాసు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `సూప‌ర్‌మ‌చ్చి`. ఇటీవ‌ల ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయ‌డంతో పాటు ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

 

ఈ చిత్రంలో క‌ల్యాణ్‌దేవ్ స‌ర‌స‌న క‌న్న‌డ బ్యూటీ ర‌చితా రామ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను న‌వంబ‌ర్ 22 నుండి ప్రారంభించ‌బోతున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS