పరుచూరి పిలుస్తున్నారు.. పవన్ వెళ్తాడా?

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానం వదులుకొని.. కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంతో సరిపెట్టుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ కిరీటం వదులుకొని.. ప్రస్తుతం సింగల్ గా మిగిలిపోయారు పవన్. ఆయన అభిమానులు మాత్రం మళ్ళీ కెమరా ముందుకు రావాలని అంటున్నారు. తాజాగా సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా ఇదే విన్నపం వినిపించారు. ''పవన్‌ కల్యాణ్‌గారికి ఒక విషయం మళ్లీ మళ్లీ చెబుతున్నా.

 

మీరు ఐదేళ్లు మేకప్‌నకు దూరంగా ఉండొద్దు. మీరు ఒక అద్భుతమైన కథాంశాలతో రాజకీయ, సోషల్‌, రైతు సబ్జెక్ట్‌లతో సినిమాలు చేయండి. 0మీరు సంవత్సరానికి ఒకటే చేస్తారని తెలుసు. కానీ, దాని ద్వారా మీరు చెప్పాలనుకున్నది ప్రజలకు చెప్పండి. మీరు రాజకీయాల్లో పైకి రావాలి. మీ కోరిక నెరవేరాలి. మీ లక్ష్యాన్ని చేరుకోవాలి. అందుకు సినిమా అడ్డుకాదు. ఈ విషయంలో ఎంజీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. ఎంజీఆర్‌ సీఎం అయ్యే వరకూ మేకప్‌ వేసుకోవడం మానలేదు'' అని గుర్తు చేశారు పరుచూరి.

 

ఎన్నికల్లో ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ రీఎంట్రీ పై కధనాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ దగ్గర కొందరి అడ్వాన్స్ లు వున్నాయి. అవి తిరిగివ్వడానికి కూడా ప్రస్తుతం పవన్ దగ్గర అంత మొత్తం లేదని, సినిమాలు చేసే తీర్చాలని వార్తలు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమా అంటే పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఐతే పవన్ కళ్యాణ్ బిజినెస్ మ్యాన్ కాదు. సినిమా మనిషి. సినిమా చేసే బ్రతకాలి. కానీ పవన్ మళ్ళీ మేకప్ అంటే.. ''చూడండి రాజకీయాలకు ప్యాకప్ చెప్పేశాడని'' హడావిడి చేస్తాయి ప్రతిపక్షాలు. ఇవన్నీ ఎదురుకొని పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయం తీసుకోవాలి. మరా నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS