స్టైలిష్‌స్టార్‌పై మనసు పారేసుకున్న హాట్‌బ్యూటీ

By iQlikMovies - October 27, 2018 - 12:25 PM IST

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్‌ స్టైల్‌ని మెచ్చుకోని ముద్దుగుమ్మలెవరైనా ఉంటారా? చెప్పండి. ఆయన యాక్టింగ్‌, డాన్సింగ్‌ స్టైల్‌కి చాలా మందే ఫ్యాన్స్‌ ఉన్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్‌ ఎక్కువ అల్లు అర్జున్‌కి. అలాగే ఓ ముద్దుగుమ్మ అల్లు అర్జున్‌ని చూసి మనసు పారేసుకుంది. ఈమె పెద్దగా పరిచయం లేదులెండి. పంజాబీ బ్యూటీ. మోడలింగ్‌ రంగం నుండి వచ్చింది. పలు ప్రముఖ పంజాబీ చిత్రాల్లో నటించింది. 

పంజాబీ బ్యూటీకి అల్లు అర్జున్‌తో ఎలా పరిచయం అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేస్తున్నా.. ఓ ట్రావెల్‌ పోర్టల్‌ యాడ్‌లో వీరిద్దరూ కలిసి నటించారట. అప్పటి నుండీ ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్‌పై ఎనలేని అభిమానం పెంచేసుకుందట. తాజాగా ఇదే యాడ్‌కి సంబంధించి మరోసారి షూటింగ్‌లో పాల్గొన్న ఈ బ్యూటీ అల్లు అర్జున్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ, ఆయనతో తాను దిగిన సెల్ఫీని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. 

ఈ ఫోటోతో ఈ బ్యూటీ ఎవరో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కి తెలిసిందన్న మాట. అయితే అసలు సంగతేంటంటే, అమ్మడు పంజాబీ సినిమాలతో పాటు, తెలుగు సినిమాలపై కూడా కన్నేసినట్లు ఆమె మాటల ద్వారా అర్ధమవుతోంది. ఇప్పటికే పలువురు పంజాబీ ముద్దుగుమ్మలు తెలుగులో హీరోయిన్స్‌గా తెరంగేట్రం చేసేశారు. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ కూడా అందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్‌ని ఇంతగా పొగిడేస్తోంది కదా. ఏమో ఆయన తన సినిమాలోనే ఛాన్సిచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ పేరు చెప్పలేదు కదా 'పారుల్‌ గులాటి'. పేరు కూడా బాగానే ఉంది. ఇక తెలుగు తెరపై మెరిసిపోవడమే తరువాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS