రయ్‌ రయ్‌ రౌడీస్‌ 'ట్యాక్సీవాలా'.!

మరిన్ని వార్తలు

భారీ అంచనాలతో విడుదలైన 'నోటా' నిరాశపరచడంతో విజయ్‌దేవరకొండలో జోరు కాస్త తగ్గినట్లుగా కనిపించింది. కానీ అదేమీ కాదట. మళ్లీ జోరు పెంచేయనున్నాడీ సెన్సేషనల్‌ స్టార్‌. త్వరలో 'ట్యాక్సీవాలా' సినిమాతో రాబోతున్నాడు. వాస్తవానికి ఈ సినిమా ఫుల్‌ డిజిటల్‌ మూవీ పైరసీ రూపంలో బయటికి వచ్చేసింది. అయినా కానీ ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసి, ధియేటర్స్‌లో విడుదల చేసేందుకు విజయ్‌ దేవరకొండ సంసిద్ధమవుతున్నాడు. 

గతంలో పవన్‌ కల్యాణ్‌ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాకీ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ ఆ సినిమా పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిపోయింది. అదే నమ్మకంతో విజయ్‌దేవరకొండ ఈ సినిమా విషయంలో కొత్త ఫార్ములా అప్లై చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఎలాగైనా ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టి తీరాల్సిందే అనే కసి మీదున్నాడట. ముఖ్యంగా ఆయన సోషల్‌ మీడియా ఫ్యాన్స్‌ రౌడీస్‌ కసి అలా ఇలా లేదు. ఎలాగైనా ఈ సినిమాని హిట్‌ చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు. 

సోషల్‌ మీడియా వేదికగా సరికొత్త మార్గాల్లో ప్రమోషన్స్‌కి ప్లాన్‌ చేశారు. వచ్చే నెల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ మరోసారి ఈ సినిమాతో అమాంతం పెంచేలా రౌడీస్‌ చేస్తున్న ప్రయత్నాన్ని విజయ్‌ దేవరకొండే మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాడట. చూడాలి మరి, విజయ్‌దేవరకొండ అండ్‌ టీమ్‌ ప్రయత్నం సఫలమయ్యేనో, విఫలమయ్యేనో. 

మరోవైపు విజయ్‌ నటిస్తున్న 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రం కూడా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. 'గీతా గోవిందం'తో క్రేజీ పెయిర్‌గా పాపులరైన విజయ్‌ - రష్మికా జంట మరోసారి ఈ సినిమాతో ఆకట్టుకోనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS