ఈ సంక్రాంతి బరిలో నిలిచింది 'సరిలేరు నీకెవ్వరు'. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. విజయశాంతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లు కూడా త్వరలోనే మొదలు కాబోతున్నాయి. ఇప్పటికి కొన్ని స్టిల్స్ బయటకు వచ్చాయి. 'సరిలేరు నీకెవ్వరు' టైటిల్‌సాంగ్ కూడా వినిపించారు. ఇప్పుడు ఈ చిత్రంలోని మరో గీతాన్ని విడుదల చేయడానికి చిత్రబృందం సమాయాత్తం అవుతోంది. ఈనెల 15న 'సరిలేరు..' నుంచి మరో పాటని బయటకు వదలనున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట... ఈ సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అదే రోజున 'అల.. వైకుంఠపురములో' కూడా రాబోతోంది. ఈ రెండు చిత్రాల్లో ఒకటి విడుదల తేదీ మార్చుకునే ఛాన్సుందని సమాచారం.