సర్కారు వారి పాట తరవాత.... పరశురామ్ కొత్త సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. అక్కినేని నాగచైతన్యతో `నాగేశ్వరరావు` అనే సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ... అనూహ్యంగా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. దాంతో... పరశురామ్ కి మరో హీరో కావాల్సివచ్చింది. ఈలోగా చాలామంది హీరోలకు కథలు వినిపించాడు పరశురామ్. ఎక్కడా వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు తిరిగి.. తిరిగి విజయ్ దేవరకొండ దగ్గరకే వచ్చి ఆగినట్టు టాక్.
విజయ్ దేవరకొండ - పరశురామ్ కాంబినేషన్లో... `గీత గోవిందం` వచ్చిన సంగతి తెలసిందే. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. రౌడీకి అమ్మాయిల్లో, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఫ్యాన్ బేస్ ని పెంచిన సినిమా అది. విజయ్ కెరీర్‌లో తొలి వంద కోట్ల సినిమా. ఆ తరవాత... ఇప్పుడు ఈ కాంబో మళ్లీ కుదిరింది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్. ఇది వరకు అటు విజయ్, ఇటు పరశురామ్ దిల్ రాజు బ్యానర్‌లో సినిమాలు చేయడానికి అడ్వాన్సులు తీసుకొన్నారు. అందుకే ఈ కాంబో ఈజీగా సెట్టయిపోయిందని టాక్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ `ఖుషి` సినిమాతో బిజీగా ఉన్నాడు. అది పూర్తవగానే... పరశురామ్ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే నాగచైనత్యకు చెప్పిన కథే అటూ ఇటూ మార్చి తీస్తున్నాడా? లేదంటే పూర్తిగా కొత్త కథ ఎంచుకొన్నాడా? అనే విషయాలు తెలియాల్సివుంది.