చిరంజీవి, రవితేజల 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతి బరిలో దిగుతుంది. ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. పూనకాలు లోడింగ్ పాటతో వీరయ్యకి మంచి జోష్ వచ్చింది. తాజాగా సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డ్ సినిమా యూ/ ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. పాటలు, ఫైట్లు సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయని సెన్సార్ ఇన్ సైడ్ టాక్. వైవిధ్యమైన కథ కాదు కానీ మాస్ కి నచ్చే ఎలిమెంట్స్ తో వీరయ్యని లోడ్ చేశారని తెలిసింది.
చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. అదే నిర్మాణ సంస్థ నుండి బాలకృష్ణ వీరసింహా కూడా సంక్రాంతి బరిలో దిగుతుంది. వీరసింహ జనవరి 12న, వీరయ్య 13న బాక్సాఫీసు రావడంలో ఈ ఏడాది టాలీవుడ్ సంక్రాంతి మరింత స్పెషల్ గా మారింది.