'వెన్నెల' అంత అందం ఆమె సొంతం. తొలి సినిమా 'వెన్నెల'తో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ, బాలకృష్ణ సరసన నటించే ఛాన్స్ అయితే దక్కించుకున్నా, తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ సంపాదించుకోలేకపోయింది. చాలా తక్కువ కాలంలోనే తెలుగు తెరకు పరిచయమైపోయినా, సోషల్ మీడియా ద్వారా తన హాట్‌నెస్‌ని పంచుతూనే ఉంది ఈ బ్యూటీ. పేరు తెలుసు కదా, పార్వతి మెల్టన్. తన స్నేహ బృందంతో ప్రపంచంలోని వివిధ దేశాల్లో చక్కర్లు కొడ్తోన్న పార్వతి మెల్టన్, ఇదిగో ఇలా బికినీలో కనిపించి కుర్రకారు గుండెల్ని 'మెల్ట్' చేసేస్తోంది. ఐటమ్ సాంగ్స్ కూడా చేసేసిన ఈ బ్యూటీ గ్లామర్‌ని మళ్ళీ తెలుగు తెరకు కొత్తగా ఎవరు పరిచయం చేస్తారోగానీ, సినిమాల్లో నటించడానికి తానెప్పుడూ సిద్ధంగానే ఉంటానని అంటోంది పార్వతి మెల్టన్.