'అజ్ఞాతం' వీడిన పవన్‌కళ్యాణ్‌

మరిన్ని వార్తలు

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ - పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్‌ కన్ఫర్మ్ చేసేశారు. అయితే తాజాగా ఈ రోజు ఉదయం ఈ సినిమా టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నారన్న వార్త వచ్చింది. ఈ రోజు ఉదయం పదింటికే టైటిల్‌ని విడుదల చేయనున్నామనీ చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే కొన్ని టెక్నికల్‌ కారణాల వల్ల కాస్త లేటయ్యింది. 

అనూ ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమాలో. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ షూటింగ్‌ని వారణాసిలో జరుపుకుంటోంది. ఈ మధ్యనే యూరప్‌ అందాల్ని చక్కబెట్టి వచ్చేసింది చిత్ర యూనిట్‌. ఇప్పుడు కాశీ విశ్వేశ్వరుని సాక్షిగా వారణాసి అందాల్ని కళ్లకు కట్టబోతున్నారు ఈ సినిమా ద్వారా. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పాత్రలో నటిస్తున్నాడు. స్లిమ్‌ అండ్‌ హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తో ఎప్పటిలా కన్నా అందంగా కనిపించనున్నాడు ఈ సినిమాలో. 

త్రివిక్రమ్‌ - పవన్‌ కాంబినేషన్‌ అంటే ఎప్పుడూ అంచనాలు భారీగానే ఉంటాయి. అయితే ఈ సారి ఆ అంచనాలు మరింత భారీగా ఉన్నాయి. ఇదో రొమాంటిక్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. 'అత్తారింటికి దారేది' చిత్రంలా అన్ని వర్గాల ఆడియన్స్‌నీ అలరించేలా ఉండబోతోందట. అనిరుధ్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ కానుంది. ఆల్రెడీ ఓ ఆడియో సింగిల్‌ సాఫ్ట్‌వేర్‌ యువతని ఊపు ఊపేస్తోంది. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS