పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం షూటింగ్ ముగించుకుని గత మూడురోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన తరపున వివిధ అంశాల పై ప్రజలతో మమేకమవుతున్నాడు.
ఇదిలాఉంటే, పవన్ అజ్ఞాతవాసి చిత్రం సరిగ్గా నెలరోజుల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబందించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకివచ్చింది. అదేంటంటే- ఈ చిత్రం తాలుకా అవుట్ పుట్ చాలా బాగా వచ్చినట్టు చెబుతున్నారు.
రచయత-దర్శకుడు త్రివిక్రమ్ ఒక మామూలు కథని తీసుకుని దానిని అత్యద్బుతంగా తెరకెక్కించిన విధానం ఈ చిత్రానికే హైలైట్ అన్న టాక్ వినిపిస్తున్నది. ఇంకొంతమంది మాత్రం ఒక అడుగు ముందుకి వేసి అత్తారింటికి దారేది చిత్రం కన్నా బాగా తీశాడు ఈ చిత్రాన్ని అని అంటున్నారు.
విడుదలకి నెల ముందే ఇంతటి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుంది అన్న ధీమా వ్యక్తమవుతున్నది.