బాహుబలి చిత్రం తరువాత అంతర్జాతీయ స్థాయి ఖ్యాతితో పాటు దేశవ్యాప్తంగా తన మార్కెట్ పరిధి పెంచుకున్న హీరో ప్రభాస్. అంతటి గొప్ప చిత్రం తరువాత తను చేస్తున్న చిత్రం పైన అంచనాలు ఉండటం సహజమే.
ఇలాంటి పరిస్థితులలో ఆయన చేస్తున్న చిత్రం- సాహో. ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు దుబాయ్ లో జరుగుతున్నట్టు సమాచారం, ఇక ఈ చిత్రానికి సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ తీయడానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ ని ఎంపిక చేసుకుని మరి షూటింగ్ జరుపుతున్నారు.
అయితే ఈ చిత్రం ముందుగా ప్రకటించినట్టుగా లేదా అనుకున్నట్టుగా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు తక్కువే అని తెలుస్తున్నది. కారణమేంటంటే- పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అనుకున్న సమయం కన్నా ఎక్కువ పట్టొచ్చు అన్న నేపధ్యంలో 2019 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల అవ్వనుంది అని సమాచారం.
ఇది ఒక రకంగా అభిమానులకి చేదు వార్తే..