ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్, తనకు దేవుడుగా భావించే పవన్ కళ్యాణ్‌తో సినిమా రూపొందిస్తున్నాడనీ, ఈ సినిమాకి బోయపాటి శీను దర్శకుడనీ, కాదు కాదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ అనీ, అబ్బే లేదు హరీష్ శంకర్ అనీ రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి ఈ మధ్య. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందనీ ప్రచారం జరిగింది. అయితే ఇవన్నీ వట్టి పుకార్లే అని తాజాగా తేలిపోయింది. ఈ ప్రచారంపై బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. నిర్మాతగా తాను ప్రస్తుతం ఏ సినిమానీ ఒప్పుకోలేదు.. అలాంటిదేదైనా ఉంటే మొదట నేనే చెబుతాను.. అని ఆయన తెలిపారు. అంటే పవన్‌తో బండ్ల సినిమా లేదని తేలిపోయింది.
హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబో మూవీ గురించి జరిగిన ప్రచారానికి గతంలోనే హరీష్ క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా బండ్ల గణేష్ క్లారిటీతో పవన్ కళ్యాణ్‌తో వీరెవరూ సినిమా తెరకెక్కించడం లేదనీ తేలిపోయింది. ఇదంతా ప్రచారమేనని పక్కాగా క్లారిటీ వచ్చేసింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఓడినా, గెలిచినా తన జీవితం రాజకీయాలకే అంకితం. ప్రజా సేవకే అర్పితం.. అంటున్నారు.
కానీ, ఇదిగో పులీ, అదిగో తోక.. అన్నట్లుగా ఇదిగో పవన్ సినిమా, అదిగో పవన్ సినిమా అంటూ ఎప్పటికప్పుడే పుకార్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఒకరు క్లారిటీ ఇస్తే, ఇంకొకరి వైపు నుండి పుకార్లు పుట్టుకొస్తున్నాయి. మొత్తానికి ప్రస్తుతానికైతే, బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ సినిమాపై క్లారిటీ వచ్చేసిందంతే.
There is no movie finalised in my banner , if there is a movie coming up I will be the first one to announce🙏🏻.
— BANDLA GANESH (@ganeshbandla) May 29, 2019