పవన్ కోసం మహేష్ కీ తప్పని వెయిటింగ్

మరిన్ని వార్తలు

మహేష్,త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీ ‘గుంటూరు కారం’.జనవరి 12 న రిలీజ్ కానుంది.ఈ క్రమంలో మహేష్,త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ డేట్ కోసం వెయిట్ చేస్తునట్టు లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్. పవన్ తో వీరికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా?ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 7,8 తేదీల్లో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ని స్పెషల్ గెస్ట్ గా పిలిస్తే బాగుంటుంది అని మహేష్ ఆలోచన. త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. అందుకనే పవన్ 7 ,8 తేదీలలో ఫ్రీ నా కాదా, అని కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు.


AP లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీ గా ఉన్నారు. ఈ బీజ్ షెడ్యూల్ లో వీరికి టైం కేటాయిస్తారో,లేదో అది కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారట త్రివిక్రమ్.ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటే, PK ఫాన్స్ కూడా ఈ మూవీ పై ప్రేమ పెంచుకుంటారు అనటంలో సందేహం లేదు. పవన్, మహేష్ ఇద్దర్నీ కలిసి ఒకే స్టేజ్ పై చూడటం ఫాన్స్ కి పండగే. ఒకే టికెట్ పై రెండు సినిమాలు చూసినంత హ్యాపీ గా ఫీల్ అవుతారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS