తమన్ & రామజోగయ్య గార్లకి నా కృతజ్ఞతలు : పవన్ కళ్యాణ్

మరిన్ని వార్తలు

పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ కి సంబంధించిన కవాతు పాట త్వరలోనే విడుదల చేయనున్నారు. రేపు జనసేన తరపున నిర్వహించబోయే జనసేన కవాతు కోసం ప్రత్యేకంగా ఈ పాటని రాయడం జరిగింది, దీనికి స్వరాలు అందించింది ప్రముఖ సంగీత దర్శకుడు తమన్.

ఇక ఈ పాట గురించి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తన భావాలకి అక్షర రూపం ఇస్తూ జనసైనికులలో పోరాట పటిమని రేకేత్తిచే విధంగా ఉంది అంటూ... ఇంత మంచి పాటని అందించినందుకు రామజోగయ్య శాస్త్రికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా సంగీత అందించిన తమన్ గురించి ప్రస్తావిస్తూ తన ఖుషి సినిమాలోని ‘ఏ మేరా జహా’ పాటకి ప్రోగ్రామింగ్ చేసిన సమయం నుండి తనకి పరిచయం అని... మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ కవాతు పాట కోసం పనిచేసే అవకాశం దక్కింది అని పేర్కొంటూ.. పాటకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు అని పొగడ్తలతో ముంచెత్తాడు.

మొత్తానికి ఈ రచయిత, సంగీత దర్శకుడికి పవన్ కళ్యాణ్ తో సినిమాలలోనే కాకుండా బయట కూడా పనిచేసే అవకాశం దొరికింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS