టాక్ అఫ్ ది వీక్- అరవింద సమేత వీర రాఘవ

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్-త్రివిక్రమ్.. ఈ కలయికలో ఒక చిత్రం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకి అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో వారి ఎదురుచూపులకి ఒక సమాధానం దొరికనట్టయింది. 

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైన సమయంలోనే ఇదొక ఎమోషనల్ సబ్జెక్ట్ అని అందరికి ఒకింత హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తారక్ తన తండ్రిని కోల్పోవడం, యాదృచ్ఛికంగా అలాంటి ఒక పాత్రనే ఈ సినిమాలో చేస్తుండడంతో ఆయన ఎంతటి భావోద్వేగానికి గురయ్యాడో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఆయనని చూస్తే మనకి తెలిసిపోయింది.

ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే, రెగ్యులర్ ఫ్యాక్షన్ కథలకి కాస్త భిన్నంగా కథనం నడుపుతూ... ఒక విధ్వంసం జరిగిపోయాక దాని తాలుకా పరిణామాలని చూపే ప్రయత్నం ఈ సినిమాలో చేశాడు త్రివిక్రమ్. తారక్ నటన గురించి చెప్పుకోవాల్సిందేముంటుంది.. ఈ తరం నటులలో ఆయన మేటి నటుడు అని తప్ప...

ఈ సినిమా మొత్తం భావోద్వేగం నిండి ఉంటుంది.. అదే సమయంలో మాటలు తక్కువ హావభావాలు ఎక్కువ అన్న పద్దతిలో ఈ సినిమా ప్రయాణం ఉంటుంది. అయితే ఆ క్రమంలో సినిమా ద్వితీయార్ధంలో కొన్ని లోపాలు ఉండడం, కథనిసరైన విధంగా అల్లలేకపోవడం వంటివాటితో ఈ సినిమా కాస్త సాగతీసినట్టుగా ఉంటుంది.

అయితే పండగ సమయంలో విడుదలకావడం, రొటీన్ కి కాస్త భిన్నంగా తీయడం, త్రివిక్రమ్ మాటలు అక్కడక్కడ పేలడం, ఎన్టీఆర్ నటనతో ఈ సినిమాకి కలెక్షన్స్ బాగానే తెచ్చిపెడుతున్నాయి. ఈ సంవత్సరం దసరా హిట్ క్రింద అరవింద సమేత పేరు రాసేసుకోవచ్చు.

ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS