ఫోటో చూస్తున్నారుగా. ఫోటోలో ఉన్నది చేగువేరా వేక్స్ స్టేట్యూ. మరి పక్కనే ఉన్నది ఎవరనుకుంటున్నారా? పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కూతురు పొలినా అంజనీ.
పవన్‌కి చేగువేరా అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఆయన అభిమానులందరికీ తెలుసు. ఆయనలాగే అభిమానుల్లో కూడా చాలామంది చేగువేరాని ఇష్టపడుతుంటారు. అలాగే పవన్ కూతురు కూడా. చూస్తున్నారుగా చేగువేరా బొమ్మ పక్కన అచ్చం ఆయనలాగే నుంచొని ఎలా పోజిచ్చిందో. ఈ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు పవన్ కళ్యాణ్.
తన పర్సనల్ ఫోటోలు ఎప్పుడూ పవన్ పోస్ట్ చేసింది లేదింతవరకూ. పవన్ తొలి సంతానమైన ఆకీరా, ఆధ్యల ఫోటోలను ఎప్పుడూ సోషల్ మీడియాలో పెట్టలేదు. అలాంటిది తాజాగా ఆయన మూడో భార్య అన్నా లెజినోవా కూతురు పొలెనా అంజనీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్ అయ్యిందిప్పుడు. ఫోటో పోస్ట్ చేయడంతో పాటు చేగువేరా ఆదర్శాల గురించి చెప్పుకొచ్చాడు పవన్. ఇప్పుడీ ఫోటో గురించి అందరూ చర్చించుకుంటున్నారు. చిన్నప్పటి నుండే చేగువేరా భావజాలాన్ని కూతురు మీద పవన్ కళ్యాణ్ రుద్దేస్తున్నాడేమో అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. సినిమా చేయాల్సిందిగా త్రివిక్రమ్ నుండి, మైత్రీ మూవీస్ ప్రొడక్షన్స్ నుండి పవన్‌పై ఒత్తిడి ఉన్నా పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. 2018 ఎలక్షన్స్ తర్వాత ఒకవేళ పవన్ కళ్యాణ్ అటు వైపు దృష్టి పెడతాడేమో చూడాలిక.