ప్రకాష్‌రాజ్‌తో అనుపమకి గొడవేంటీ.?

By iQlikMovies - July 07, 2018 - 16:33 PM IST

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో రామ్‌, క్యూట్‌ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'హలో గురూ ప్రేమకోసమే'. నక్కిన త్రినాధరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో ప్రకాష్‌రాజ్‌కీ, అనుపమాకి మధ్య గొడవ జరిగింది. తండ్రి పాత్రలో ప్రకాష్‌ రాజ్‌, కూతురు పాత్రలో అనుపమా నటిస్తోంది. 

ఓ సీన్‌ చిత్రీకరిస్తున్నప్పుడు, ప్రకాష్‌రాజ్‌, అనుపమా నటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉచిత సలహా ఇచ్చేందుకు ప్రయత్నించాడట. వయసులో పెద్దవాడని గౌరవించి, మొదట్లో లైట్‌ తీసుకున్నా, ప్రకాష్‌రాజ్‌ నుండి ఉచిత సలహాల ప్రవాహం ఆగకపోవడంతో, చిరాకు వచ్చి ప్రకాష్‌రాజ్‌ని కడిగి పాడేసిందట. నేను చేసింది నచ్చకపోతే కరెక్ట్‌ చేయడానికి డైరెక్టర్‌ ఉన్నాడు. నా విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. మీ మీద నాకున్న గౌరవం చెడగొట్టుకోవద్దు అని అనుపమా తెగేసి చెప్పిందట. 

ఈ గొడవ కారణంగా షూటింగ్‌ డిస్ట్రబ్‌ అయ్యిందనీ తెలుస్తోంది. ప్రకాష్‌రాజ్‌ మంచి నటుడే కాదు, వివాదాలతో నిత్యం సావాసం చేసే వ్యక్తి. గతంలోనూ ప్రకాష్‌రాజ్‌ ఓవరాక్షన్‌ కారణంగా కొన్ని సినిమాలు సమస్యలు ఎదుర్కొన్నాయి. ఆ కారణంగానే కొంత కాలం పాటు అవకాశాలు తగ్గిపోయాయి కూడా. ఇప్పుడు కూడా ప్రకాష్‌రాజ్‌కి చాలా అరుదుగా మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. 

అయితే అనుపమా, ప్రకాష్‌రాజ్‌ ఘటనకు సంబంధించి 'హలో గురూ ప్రేమకోసమే' టీమ్‌ ఇంతవరకూ స్పందించలేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS