పవన్ కల్యాణ్ కెరీర్‌లో `ఖుషి` మర్చిపోలేని సినిమా. యువతరానికి ఆ సినిమా మరింత దగ్గర చేసింది. ఆ సినిమాలోని పాటలు, పవన్ మేనరిజం, కాస్ట్యూమ్స్, డైలాగ్స్... ఇలా ఏ ఒక్కటీ మర్చిపోలేం. ఇప్పటికీ లవ్ స్టోరీ అంటే ఖుషీనే గుర్తొస్తుంది. `ఖుషి 2` చేయాలన్నది ఎస్.జే సూర్య కోరిక. అందుకోసం ఓ కథ కూడా రెడీ చేసుకున్నాడు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం `ఖుషీ 2`కి నో చెప్పడం విశేషం.
ఎందుకంటే.. ఈ వయసులో తను లవ్ స్టోరీలు చేయడం బాగోదని పవన్ భావిస్తున్నాడట. ఇదే విషయం సూర్యకి చెప్పేశాడట. కానీ సూర్య మాత్రం పవన్ ఈ వయసులో లవ్ స్టోరీలు చేసినా బాగానే ఉంటుందని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నాడట. మరి పవన్ అంగీకరిస్తాడో లేదో చూడాలి. ఖుషీ తమిళ వెర్షన్ లో సూర్యనే నటించాడు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఖుషీ 2 తమిళంలో తీసి, అది హిట్టయితే... అప్పుడు పవన్ చేయడానికి ముందుకు వస్తాడేమో..? ఖుషీ 2 విషయంలో సూర్య ప్లాన్ ఏమిటో చూడాలి.