'అజ్ఞాతవాసి' వంటి పెద్ద సినిమాలు భారీగా నిరాశ పరచడంతో డల్‌గా స్టార్ట్ అయిన ఈ ఏడాది, 'భాగమతి', ఛలో' వంటి ఒకటీ అరా చిన్న సినిమాల హిట్స్‌తో ప్రధమార్ధం ముగిసిపోయింది. ఇక మెగాపవర్‌స్టార్ చరణ్ 'రంగస్థలం'తో టాలీవుడ్ బాక్సాఫీస్ జోరందుకుంది. ఆ జోరును తర్వాత వచ్చిన 'భరత్ అనే నేను' సినిమాతో మహేష్ కొనసాగించాడు. బాక్సాఫీస్ వద్ద 'భరత్' సినిమా కూడా మంచి వసూళ్లు రాబడుతోంది.
ఇక తరవాతి వంతు సూర్యదే. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో వస్తున్న అల్లు అర్జున్ వంతొచ్చింది. ఈ రెండు సినిమాలతో చరణ్, మహేష్ ఇచ్చిన సక్సెస్ జోరుతో అల్లు అర్జున్ సినిమాపై అంచనాలు పెరిగాయి. హిట్ సింప్టమ్స్ కూడా బాగా పెరిగాయి. అంతేకాదు, మెగా ఫ్యామిలీ హీరో అయినప్పటికీ, 'డీజె' సినిమా నాటికి మెగా అభిమానులు, బన్నీ అభిమానులు అంటూ అభిమానుల్లో వచ్చిన చీలికలు కూడా బన్నీ నటించిన 'డీజె' సినిమాని దెబ్బ తీశాయనడానికి ఓ కారణంగా చెప్పక తప్పదు.
అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. శ్రీరెడ్డి ఇష్యూతో మెగా హీరోలంతా ఓ మాట మీదున్నారు. దాంతో మెగా అభిమానులు కూడా కలిసిపోయారు. ఇది కూడా ఇప్పుడు రాబోతున్న 'నా పేరు సూర్య' సినిమాకి కలిసొచ్చే అంశమే. శ్రీరెడ్డి ఇష్యూతో పవన్ చేపట్టిన నిరసనకు బన్నీ మద్దతుగా నిలవడం, మెగా కుటుంబం అంతా ఒక్కటే అని సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వేదికపై బన్నీ ఓపెన్‌గా ఉపన్యాసాలివ్వడంతో అభిమానుల్లో కూడా మార్పు వచ్చింది.
ఇవన్నీ సూర్య సినిమాకి కలిసొచ్చే అంశాలే కావడంతో, సూర్యకిక తిరుగు లేదంటున్నారు.