తమ్ముడి కోసం త్యాగం చేస్తానంటోన్న మెగాస్టార్‌!

మరిన్ని వార్తలు

మెగా కాంపౌండ్‌ నుండి పెద్ద తలకాయలైన మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ సినిమాల్లో యాక్టివ్‌గా వున్న సంగతి తెలిసిందే. 150వ సినిమాతో చిరంజీవి ఎప్పుడో రీ ఎంట్రీ ఇవ్వగా, ‘వకీల్‌ సాబ్‌’తో పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పవన్‌ రీ ఎంట్రీ షురూ అయిన వెంటనే, ఒకదానిపై ఒకటిగా ఆయన చేయబోయే ప్రాజెక్టులు లైన్‌లోకి వచ్చేశాయి. ఆ క్రమంలో ‘వకీల్‌ సాబ్‌’ తర్వాత, క్రిష్‌ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా ఒకటుంది. ఆ తర్వాత హరీష్‌ శంకర్‌ సినిమా కూడా లైన్‌లోనే ఉంది.

 

ఇక చిరంజీవి విషయానికి వస్తే, ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో నటిస్తున్నా అయన, తర్వాత మలయాళ రీమేక్‌ ‘లూసిఫర్‌’లో నటించాల్సి వుంది. అయితే, ‘లూసిఫర్‌’ విషయంలో ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ వినిపిస్తోంది. ఈ సినిమా రైట్స్‌ని చిరంజీవి కోసమే తీసుకున్నారు. ఆ సినిమాలో నటించేందుకు చిరంజీవి కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలిపారు. అయితే, ఒకవేళ తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ అడిగితే, కాదనకుండా ఇచ్చేస్తానని చిరంజీవి తాజాగా తెలిపారు. అంటే పవన్ ఏ సినిమా పై ఆసక్తి కనబరుస్తున్నారా.. మోహన్‌లాల్‌, పృధ్వీరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా రీమేక్‌లో చిరంజీవి, చరణ్‌ నటించబోతున్నారన్న ప్రచారం ఇంతవరకూ జరిగింది.

 

అయితే, మెగా స్టార్ ఇచ్చిన తాజా అప్‌డేట్‌తో ఒకవేళ పవన్‌ నటిస్తే, పవన్‌కి కాంబినేషన్‌ స్టార్‌ ఎవరనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS