తన సినిమాలో నటించమని కమెడియన్ అలీని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడిగాడట.. అనే వార్తలు ఈ మధ్య మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే, ఈ ప్రచారంపై తాజాగా అలీ స్పందించారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నదంతా అబద్ధమని తెలిపాడు. కానీ, పవన్ అడిగితే, నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నాననీ, అయితే, సినిమా గురించి ఇంతవరకూ తనతో ఎలాంటి సంప్రదింపులూ జరగలేదనీ అలీ స్పష్టం చేశారు. అలీకీ, పవన్ కళ్యాణ్‌కీ మధ్య విడదీయరాని స్నేహ సంబంధం ఉన్న సంగతి అందరికీ బాగా తెలిసిన సంగతే. కానీ, 2019 ఎన్నికల సమయంలో రాజకీయం వీరి మధ్య స్నేహాన్ని, వైరంగా మార్చింది.
ఒకరినొకరు పర్సనల్‌గా నిందించుకునే స్థాయికి పరిస్థితి దిగజారింది. అఫ్‌కోర్స్.. అదంతా రాజకీయాల్లో సహజమే అనుకోవచ్చుగాక. కానీ, వీరి మధ్య గ్యాప్ వచ్చిందన్నది మాత్రం సత్యం. అయితే, రాజకీయాలు వేరు, సినిమాలు వేరు.. నిజంగానే పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే ఛాన్స్ వస్తే, ఖచ్చితంగా వదులుకోను.. అనేది ప్రస్తుతం అలీ చెబుతున్న మాట. అంతా బాగానే ఉంది. కానీ, ఒకప్పుడు ‘అలీ నా గుండెకాయ.. అలీ లేకుండా నా సినిమా లేదు..’ అని చెప్పిన పవన్, మళ్లీ ఆ మాటను నిజం చేస్తాడా.? నిజంగానే అలీకి తన సినిమాలో పవన్ కళ్యాణ్ ఛాన్సిస్తాడా.? ఏమో చూడాలి మరి. ప్రస్తుతం అలీ ‘అబ్దుల్ కలాం’ బయోపిక్‌లో లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఇదిలా వుంటే, ముందు ముందు పవన్ కళ్యాణ్ - అలీ కలిసి నటించే అవకాశాలు లేకపోలేదని టాలీవుడ్ ప్రముఖులు చాలామంది అభిప్రాయపడుతున్నారు.