ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలవ్వాల్సింది. కానీ.. చివరి నిమిషాల్లో ఈ ప్రాజెక్టు కాన్సిల్ అయ్యింది. త్రివిక్రమ్ మహేష్‌తోనూ, ఎన్టీఆర్ కొరటాలతోనూ సినిమాల్ని ఫిక్స్ చేసుకున్నారు. అసలు ఈ ప్రాజెక్టు కాన్సిల్ అవ్వడానికి కారణమేంటి? అనే విషయం ఎవరూ చెప్పడం లేదు. కాకపోతే.. బయట బోలెడన్ని రీజన్స్ చెప్పుకుంటున్నారు సినీ జనాలు.
ఎన్టీఆర్ కి చెప్పిన కథే.. చరణ్, మహేష్‌లకూ త్రివిక్రమ్ చెప్పేశాడని, ఆ విషయం ఎన్టీఆర్ కి తెలిసి.. ఈ సినిమా నేను చేయను అనేశాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో కారణం కూడా వినిపిస్తోంది. త్రివిక్రమ్ ఈ మధ్య పవన్ కల్యాణ్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. వకీల్ సాబ్... సినిమా విషయంలో త్రివిక్రమ్ చాలా కేర్ తీసుకున్నాడని టాక్. అంతే కాదు.. అయ్యప్పనుమ్ కోషియమ్ ప్రాజెక్టు వెనుక కర్త కర్మ క్రియ అంతా.. త్రివిక్రమే. దాంతో ఎన్టీఆర్ తో డిస్కర్షన్స్ సరిగా నడిచేవి కావని, ఈ విషయంలో త్రివిక్రమ్ పై ఎన్టీఆర్ అసహనంగా ఉండేవాడని, ఈ సినిమా వదులుకోవడానికి అది కూడా ఓ కారణమే అని చెప్పుకుంటున్నారు. అయితే వీటిలో నిజా నిజాలు.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ లకే తెలియాలి.