త్వరలోనే `మా` ఎన్నికలు జరగబోతున్నాయి. గత రెండేళ్లలో `మా`లో చాలా వివాదాలు చెలరేగాయి. వీటిపై సినీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఈసారి మాత్రం అధ్యక్షుడి విషయంలో చాలా జాగ్రత్త తీసుకుని... అందరి మద్దతుతో ఒకరిని ఏకగ్రీవంగా ఎంచుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రకాష్‌రాజ్ కి చిరంజీవి మద్దతు ఎక్కువగా ఉందని, చిరు మద్దతుతోనే.. ప్రకాష్ రాజ్ బరిలోకి దిగుతున్నారని సమాచారం. చిరు కాంపౌండ్ హీరోలు సపోర్ట్ చేస్తే.. `మా` అధ్యక్షుడిగా గెలవడం చాలా ఈజీ. కాబట్టి ఈసారి ప్రకాష్ రాజ్ గెలుపు ఖాయమన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈసారి పోటీ లేకుండా, ప్రకాష్ రాజ్ ని ఏకగ్రీవంగా ఎంపిక చేయాలన్నది సినీ పెద్దల అభిప్రాయం. మరి అది జరుగుతుందా? లేదంటే ప్రకాష్ రాజ్ పై పోటీ కి ఎవరైనా దిగే సాహసం చేస్తారా, అనేది చూడాలి.