'రంగస్థలం' మెగాపవర్‌ ఈవెంట్‌ త్వరలో

By iQlikMovies - April 10, 2018 - 12:25 PM IST

మరిన్ని వార్తలు

'రంగస్థలం' రెండు వారాల్లో సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అన్నిచోట్లా నాన్‌ బాహుబలి రికార్డుల్ని దాటేసింది. మూడు మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది 'రంగస్థలం'. ఇకపోతే తాజాగా ఈ సినిమాని పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి చూశారు. సినిమా పవన్‌కి చాలా బాగా నచ్చింది. చరణ్‌ యాక్టింగ్‌కి పవన్‌ ఫిదా అయిపోయాడు. చరణ్‌ని ప్రశంసలతో ముంచెత్తేశాడు పవన్‌ కళ్యాణ్‌. 

ఇదిలా ఉంటే, ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని వైజాగ్‌లో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలైంది. కనీ వినీ ఎరుగని అత్యంత ఘన విజయాన్ని కట్టబెట్టారు ప్రేక్షకులు. అందుకే మరింత ఉత్సాహంతో ఈ సినిమా విజయోత్సవ వేడుకను నిర్వహించేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోందట. ఈ వేడుక ప్రత్యేకించి పవన్‌ కోసమేనని అంటున్నారు. 'రంగస్థలం' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి కూడా పవన్‌ కళ్యాణ్‌ వస్తాడనీ అభిమానులు ఆశించారు. 

కానీ పవన్‌ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న కారణంగా ఆ ఈవెంట్‌కి రాలేకపోయాడు. కానీ ఈ సక్సెస్‌ ఈవెంట్‌కి పవన్‌ కళ్యాణ్‌ తప్పక విచ్చేయనున్నారనీ, చిత్ర వర్గాల ద్వారా అందుతోన్న సమాచారమ్‌. అదే జరిగితే మెగా అభిమానులకు పండగే పండగ. ఒకే వేదికపై మెగాస్టార్‌, పవర్‌స్టార్‌, మెగా పవర్‌స్టార్‌లను చూసిన అభిమానుల ఆనందానికి అంతే ఉండదు. అంతేనా ఆ అందమైన దృశ్యానికి రెండు కళ్లూ చాలవంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS