గాలి వాలుగా.. కూల్‌ కూల్‌గా కోసేయగా

మరిన్ని వార్తలు

'అజ్ఞాతవాసి' మరో ఆడియో సింగిల్‌ వచ్చేసింది. 'గాలి వాలుగా.. ఓ గులాబి వాలి గాయమైనదే గుండెకి తగిలి..' అంటూ హీరోయిన్‌ కోసం హీరో వర్ణిస్తూ పాడుతూంటే సంగీత ప్రియుల గుండెకు నిజంగానే గులాబి గాయం తగిలినట్లే ఉంది. అనిరుధ్‌ మ్యూజిక్‌లో అనిరుధ్‌ గొంతుతో ఈ పాట అలరించేస్తోంది. 

తొలి ఆడియో సింగిల్‌ని మించిపోయేలా ఉంది ఈ సాంగ్‌లోని ఫీల్‌. త్రివిక్రమ్‌ - పవన్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'జల్సా' ఆడియో రికార్డు హిట్‌ కొట్టింది. అలాగే అలాంటి రికార్డుల్నే ఈ ఆడియో క్రియేట్‌ చేసేలా అనిపిస్తోంది. మాంచి మ్యూజిక్‌ టేస్ట్‌ ఉన్న త్రివిక్రమ్‌, పవన్‌ కోసం దగ్గరుండి ఈ సాంగ్స్‌ని ట్యూన్‌ చేయించాడు అనిరుధ్‌ చేత. ఇంతవరకూ అనిరుధ్‌తో సోలో వాయిస్‌ సాంగ్స్‌నే రిలీజ్‌ చేశాడు త్రివిక్రమ్‌. ఈ రెండూ కూల్‌ కూల్‌ అండ్‌ రొమాంటిక్‌ సాంగ్సే. 

అయితే పవన్‌ కళ్యాణ్‌ అంటే జోష్‌. ఆ జోష్‌ ఉన్న సాంగ్స్‌ కోసం ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. ఈ రెండు పాటల్లోనూ లేడీ వాయిస్‌ వినిపించలేదు. నెక్స్ట్‌ సాంగ్‌లోనైనా లేడీ వాయిస్‌ ఉంటుందేమో చూడాలి మరి. ఈ ఆడియోతోనే అనిరుధ్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా. ఫ్రెష్‌ అండ్‌ కూల్‌ సాంగ్స్‌ డిఫరెంట్‌ మ్యూజిక్‌తో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. 'కొలవెర్రి' పాటతో యూత్‌కి వెర్రి పుట్టించేసిన ఈ కుర్రోడు పవన్‌ కళ్యాణ్‌ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వడం, తన నెక్ట్స్‌ సినిమా మ్యూజిక్‌ కూడా త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనే అందిస్తుండడం విశేషం. 

ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకి కూడా అనిరుధ్‌ మ్యూజిక్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ కాంబినేషన్‌ సెట్స్‌ మీదికి వెళ్లనుంది. ఇక 'అజ్ఞాతవాసి' జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనూ ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS