రామ్ చ‌ర‌ణ్ కి హ్యాండిచ్చిన ప‌వ‌న్‌

By Inkmantra - March 07, 2020 - 15:29 PM IST

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ - రామ్ చ‌ర‌ణ్‌ల మ‌ధ్య అనుబంధం ప్ర‌త్యేక‌మైన‌ది. చ‌ర‌ణ్‌ని ప‌వ‌న్ సొంత బిడ్డ‌లా చూసుకుంటాడు.చ‌ర‌ణ్ కూడా ప‌వ‌న్‌పై త‌న ప్రేమాభిమానాల్ని చూపిస్తూనే ఉన్నాడు. చ‌ర‌ణ్ `కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌` ని మొద‌లెట్టాక త‌న బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఓ సినిమా చేయాల‌ని అనుకున్నాడు. ఆమ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో కూడా బాబాయ్‌తో సినిమా చేస్తా అని చెప్పాడు. దాంతో ప‌వ‌న్ క‌థానాయ‌కుడిగా చ‌ర‌ణ్ నిర్మాత‌గా ఓ సినిమా వ‌స్తుంద‌ని అంతా ఆశించారు. చ‌ర‌ణ్ కూడా ప‌వ‌న్ కోసం క‌థ‌ల్ని అన్వేషించాడు.

 

ఈమ‌ధ్య ప‌వ‌న్ సినిమాల‌పై సినిమాల్ని ఒప్పుకుంటున్నాడు. దిల్ రాజుతో ఓ సినిమా, ఏఎం ర‌త్నంతో మ‌రోటి, మైత్రీలో ఒక‌టి చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే త్రివిక్ర‌మ్‌తోనూ ఓ సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ చిత్రానికి అల్లు అర‌వింద్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ట‌. ఈ సినిమాకైనా చ‌ర‌ణ్ ప్రొడ్యూస్ చేస్తాడ‌ని భావించారు. కానీ ఆ ఛాన్స్ చ‌ర‌ణ్‌కి దక్క‌లేదు. ఈ సినిమాల‌న్నీ పూర్త‌య్యేస‌రికి క‌నీసం రెండేళ్లు ప‌డుతుంది. అప్ప‌టి వ‌ర‌కూ చ‌ర‌ణ్‌కి ప‌వ‌న్ అవ‌కాశం ఇవ్వ‌లేడ‌న్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS