మెగా హీరోకి డ్రంక్ & డ్రైవ్ టెస్ట్

By iQlikMovies - May 19, 2018 - 19:27 PM IST

మరిన్ని వార్తలు

హైదరాబాద్ జంట నగరాలలో ప్రతి వారంతం పోలీసులు డ్రంక్ & డ్రైవ్ నిర్వహించడం, మద్యం సేవించి వాహనాలు నడిపేవారి పైన చర్యలు తీసుకుంటుండం అందులో అప్పుడప్పుడు సెలబ్రిటీలు, సినిమాస్టార్లు పట్టుబడడంతో అందరికి డ్రంక్ & డ్రైవ్ పైన భయంతో పాటుగా ఆసక్తి పెరిగింది.

ఇక ఇందులో భాగంగా నిన్న రాత్రి కూడా డ్రంక్ & డ్రైవ్ నిర్వహించారు, అలా నిర్వహిస్తున్న క్రమంలో మెగా సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ అటుగా వస్తుండడంతో ఆయనకి కూడా బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేశారు. ఇక దీనితో అక్కడ ఉన్న మీడియా కూడా ఆత్రుతగా ఈ మొత్తం టెస్ట్ ని గమనించింది. 

అయితే ఆయన మద్యం సేవించకపోవడంతో ఆ టెస్ట్ లో జీరో సూచించింది. దీనితో ఆయనని పోలీసులు వెంటనే పంపించేశారు. ఇక గతంలో కూడా పలువురు సెలబ్రిటీలు డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ లో దొరకడంతో అందరూ సాయి ధరం తేజ్ విషయాన్నీ పైన ఆసక్తి చూపారు.

మరి ఈ విషయం పైన సుప్రీమ్ హీరో ఎలా స్పందిస్తాడో చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS