తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది అందాల భామ తాప్సీ. అయితే తెలుగులో తమిళంలో హీరోయిన్ తాప్సీకి అన్నీ గ్లామరస్ పాత్రలే దక్కాయి. వాటిల్లో ఆమె రెచ్చిపోయి అందాల ప్రదర్శన కూడా చేసేసింది. అయితే హీరోయిన్ తాప్సీ చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అట. తెరపై చూడ్డానికి క్యూట్‌గా కన్పించినా తనలో హీరోయిజం ఎక్కువ అంటోంది ఈ బ్యూటీ. అది నిజం కూడా. అందుకే 'నామ్ షబానా' లాంటి సినిమాలు చేయగలుగుతోంది. వాటిల్లో యాక్షన్‌తో అదరగొట్టేస్తోంది. అయితే తెలుగులో నటిస్తున్నప్పుడు తాప్సీలో ఈ కోణం ఎవరికీ కన్పించలేదు. కారణమేంటంటే తనలోని ఆ హీరోయిజంని సౌత్‌లోని దర్శకులెవరూ చూడకపోవడమేనట. బాలీవుడ్‌కి వెళ్ళాక తాప్సీ అసలు రూపం అందరికీ కన్పిస్తోంది. 'బేబీ' సినిమాలో కొంత యాక్షన్ పార్ట్ చేసిన తాప్సీ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు 'నామ్ షబానా' సినిమాతో కంప్లీట్ యాక్షన్ గర్ల్‌గా మారిపోయింది. ఇదే తన నిజస్వరూపం అంటున్న తాప్సీ, సినీ ఇండస్ట్రీలో అయినా రియల్ లైఫ్‌లో అయినా తనలోని హీరోయిజం తనకు ఇష్టమని చెబుతుంది. మార్చ్ 31న 'నామ్ షబానా' విడుదల కాబోతోంది. తమిళ, తెలుగు భాషల్లోకీ డబ్ అయ్యింది ఈ సినిమా. 'నామ్ షబానా'పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ కోసం తాప్సీ పడుతున్న కష్టం ముచ్చటగొలుపుతుంది. సినిమా కోసం ఎంత కష్టపడుతోందో సినిమా ప్రమోషన్ కోసం అంత కష్టపడుతున్న తాప్సీకి ఈ సినిమా మంచి విజయాన్నిస్తుందేమో చూడాలిక.