పవన్ కల్యాణ్ చిత్రం కాటమరాయుడు భారీ అంచనాలమధ్య విడుదలైంది. హైదరాబాద్‌లో మినహా... అన్ని చోట్లా బెనిఫిట్ షోలతో కాటమరాయుడు తన రికార్డు ప్రస్థానానికి శ్రీకారం చుట్టాడు. తొలిరోజే కాటమరాయుడు పాత రికార్డులన్నింటికీ చెల్లు చీటి పాడేస్తుందని ఊహించారంతా. అప్పటి వరకూ ఖైదీ నెం.150 (తొలిరోజు రూ.23.56 కోట్లు)తో టాలీవుడ్ నెం.1గా ఉండేది. దాన్ని తమ్ముడు పవన్‌కల్యాణ్ బీట్ చేస్తారని ఆశించారు. కానీ కాటమరాయుడి రూ.23 కోట్ల వసూళ్లు మాత్రమే దక్కాయి. తృటిలో ... అన్నయ్య రికార్డు ముందు ఆగిపోయాడు పవన్. నైజాంలో కాటమరాయుడికి రూ.4.77 కోట్లు, సీడెడ్‌లో 2.98 కోట్లు, ఈస్ట్‌లో రూ.3.56 కోట్లు దక్కాయి. ఓవర్సీస్‌లో రూ.3 కోట్లు దక్కింకొంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్!! హైదరాబాద్‌లో బెనిఫిట్ షోలు పడి ఉంటే... ఖైదీ నెం.150 రికార్డుని కాటమరాయుడు అందుకొనేవాడని పవన్ ఫ్యాన్స్ వ్యాఖ్యానించడం విశేషం.