'కాటమరాయుడు' సందడి కెవ్వు కేక

మరిన్ని వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ సినిమా 'కాటమరాయుడు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకి నెలకొన్న సందడి అంతా ఇంతా కాదు. తమ అభిమానాన్ని చాటుకునేందుకు అభిమానులు ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించారు. పంచెకట్టుతో ధియేటర్స్‌ ముందు సందడి చేస్తున్నారు. ఇక ఫస్ట్‌ షో చూసిన అభిమానులు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. సినిమా సూపర్‌ హిట్‌ అని ఆనందంతో నినాదాలు చేస్తున్నారు. సినిమాలో పవన్‌ కళ్యాన్‌ నటన అద్భుతంగా ఉందంటున్నారు. 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' సినిమాతో నిరాశ పరిచిన పవన్‌ కళ్యాణ్‌ ఈ సారి ఫ్యాన్స్‌ని పూర్తిగా సంతృప్తిపరిచారనే టాక్‌ వినిపిస్తోంది. ఆధ్యంతం వినోదంతో సినిమా నడుస్తుందని అంటున్నారు అభిమానులు. లవ్‌ ట్రాక్‌ నడిపించడంలో పవన్‌ స్టైలే వేరు. ఈ సినిమాలో పవన్‌కి అమ్మాయిలంటే అస్సలు నచ్చదు. కానీ లవ్‌లో పడతాడు. ఆ లవ్‌ ట్రాక్‌ సూపర్బ్‌గా ఉందంటున్నారు. అలాగే అన్నదమ్ముల మధ్య జరిగే ఎమోషన్స్‌ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయంటున్నారు. మొత్తానికి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కాటమరాయుడు' ఆ అంచనాల్ని అందుకుని ఫ్యాన్స్‌కి పండగ తెచ్చిందని చెప్పొచ్చు. డాలీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS