'కాటమరాయుడు' నవ్వులే నవ్వులు

మరిన్ని వార్తలు

'కాటమరాయుడు' సినిమా రిలీజ్‌కి సిద్ధమైన సందర్భంగా చిత్ర యూనిట్‌ మీడియా చిట్‌చాట్‌లతో బిజీ అయిపోయింది. ఈ చిట్‌ చాట్స్‌లో చిత్ర యూనిట్‌ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటోంది. సరదా సరదాగా సినిమా ఎక్స్‌పీరియన్స్‌ని పంచుకుంటోంది. సెట్‌లో ఎంత సందడి చేశారో కానీ, ఈ ఇంటర్వ్యూల్లో మాత్రం చిత్ర యూనిట్‌ చేస్తోన్న సందడి అంతా ఇంతా కాదు. అలీ, శివబాలాజీ, కమల్‌ కామరాజు, చైతన్య కృష్ణతో కలిసి చిత్ర డైరెక్టర్‌ డాలీ ఫుల్‌ జోష్‌ మీదున్నారు. వీరి జోష్‌ చూస్తుంటే సినిమా ఏ రేంజ్‌లో హిట్‌ అందుకుంటుందో ఊహించడానికే కష్టంగా ఉంది. ఇంతవరకూ ఏ సినిమా షూటింగ్‌లోనూ ఇంత సరదాగా ఎంజాయ్‌ చేయలేదని శివబాలాజీ చెబుతున్నాడు. చాలా సినిమాల్లో నటించాను కానీ ఈ సినిమాకి ఎంజాయ్‌ చేసినంత మరే సినిమాకి ఎంజాయ్‌ చేసి ఉండనేమో అని నవ్వుల రారాజు ఆలీ చెప్పడం విశేషం. తమిలంలో ఘన విజయం సాధించిన 'వీరమ్‌'కి తెలుగు రీమేక్‌ ఈ సినిమా. రీమేకే అయినా కానీ విజువల్‌గా ట్రైలర్‌ చూస్తుంటే ఆ ఫ్లేవర్‌ ఎక్కడా కనిపించడం లేదు. చాలా ఆహ్లాదమైన వాతావరణంలో ఈ సినిమా షూటింగ్‌ జరిగిందంటున్నారు. ఒక పండగ వాతావరణాన్ని ఈ సినిమాతో ఎంజాయ్‌ చేశామని చిత్ర యూనిట్‌ ఎంతో ఆనందంగా చెబుతోంది. డాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS