పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్' తో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటుగా క్రిష్ దర్శకత్వంలో పవన్ మరో సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రెగ్యులర్ గా అన్ని సినిమాల తరహాలో ఉన్నట్టుగా పాటలు ఉండవట.
జస్ట్ రెండు పాటలు మాత్రమే ఉంటాయని, అవి కూడా కథలో భాగంగా నేపథ్యంలో వచ్చే పాటలని సమాచారం. పవన్ లాంటి కమర్షియల్ హీరో సినిమాలో ఇది నిజంగా ఓ ప్రయోగమేనని చెప్పాలి. ఈ సినిమా ఓ పీరియడ్ కథాంశంలో తెరకెక్కే యాక్షన్ సినిమా అని అంటున్నారు. కథకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కాబట్టే రెగ్యులర్ సినిమాల తరహాలో ఐదు ఆరు పాటలు పెట్టే ఆలోచనను విరమించుకున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందని, విజువల్ ఎఫెక్ట్స్ అవసరం కూడా ఎక్కువే ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.